నిలకడగా పెట్రో, డీజిల్ ధరలు.. ధరలు పెంచని కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో గత రెండు వారాలుగా ఇంధన ధరల్లో స్థిరత్వం కొనసాగుతోంది. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తర్వాత..latest telugu news

Update: 2022-06-05 13:49 GMT

న్యూఢిల్లీ: దేశంలో గత రెండు వారాలుగా ఇంధన ధరల్లో స్థిరత్వం కొనసాగుతోంది. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తర్వాత ధరల పెరుగుదల లేదా తగ్గుదల లేకపోవడం గమనార్హం. గత నెల 21న కేంద్ర మంత్రి సీతారామన్ ఎక్సైజ్ సుంకంపై తగ్గింపు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించింది. దీంతో పలు రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ వ్యాట్‌ను తగ్గించాయి. దేశంలో ధరల పెరుగుదలపై విమర్శలు వస్తున్న సమయంలో ఈ ప్రకటన చోటుచేసుకుంది. ఇక దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.96.72గా ఉండగా, డీజిల్ రూ.86.62గా ఉంది.

గత రెండు వారాలుగా ఇదే ధర కొనసాగుతుంది. మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యం చమురును తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పలు దేశాలు రష్యా నుంచి దిగుమతులపై ఆంక్షలు విధించడంతో, భారత్‌కు చౌక ధరకే చమురు సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ధరల పెంపులో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నాయి. మరోవైపు ధరలను స్థిరంగా ఉంచడంపై ఉన్న కారణం తెలియట్లేదు. కొన్ని నెలల క్రితం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనూ కేంద్రం ఇలాంటి చర్యలనే అనుసరించింది.


Similar News