ఏకంగా జమ్మూకశ్మీర్‌ DGPగా పేర్కొంటూ డబ్బులు అడుగుతున్న వ్యక్తి.. పోలీసుల హెచ్చరిక

జమ్మూకశ్మీర్‌లో ఓ వ్యక్తి, ఉన్నతస్థాయి పోలీసు అధికారిగా పేర్కొంటూ డబ్బులు అడుగుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2024-04-07 09:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ఓ వ్యక్తి, ఉన్నతస్థాయి పోలీసు అధికారిగా పేర్కొంటూ డబ్బులు అడుగుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ వ్యక్తి ఏకంగా జమ్మూకశ్మీర్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)గా నటిస్తూ డిపార్ట్‌మెంట్‌లోని ఇతర ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు కాల్ చేసి డబ్బులు అడుగుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై ఆదివారం పోలీసు అధికారులు కీలక ప్రకటన చేశారు. వారు పేర్కొన్న దాని ప్రకారం, ఓ అగంతకుడు మొబైల్ ఫోన్ నంబర్ 8891979985 ద్వారా కాల్ చేసి DGP RR స్వైన్‌గా పేర్కొంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ సేవలు, విభాగాలలోని ఉద్యోగులు, సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ మోసగాడి ట్రాప్‌లో పడకుండా ఇలాంటి ఫోన్‌ కాల్ వస్తే సమాచారం అందించాలని పోలీసులు సోషల్ మీడియా ఎక్స్‌లో రాశారు. అలాగే DGP కి తెలిసిన స్నేహితులు, సహచరులు, బంధువులు కూడా ఈ వ్యక్తి గురించి అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థించారు. వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.


Similar News