రైల్లో ప్రయాణించిన వృద్ధులకు భారీ జరిమానా? నష్టపరిహారం చెల్లించాలని రైల్వే శాఖకు కోర్టు ఆదేశం
పీఎన్ఆర్ నంబర్ మ్యాచ్ అవ్వలేదని ఇద్దరు వృద్ధ దంపతులను 22, 000 జరిమానా విధించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: పిఎన్ఆర్ నంబర్ మ్యాచ్ అవ్వలేదని ఇద్దరు వృద్ధ దంపతులను 22, 000 జరిమానా విధించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ‘‘బెంగళూరులోని వైట్ ఫీల్డ్‌లో నివాసం ఉంటున్న అలోక్ కుమార్ 70 ఏళ్లు పైబడిన తమ తల్లిదండ్రులకు ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేశాడు. వారు ట్రైన్ ఎక్కాక.. టికెట్ చెకింగ్ కోసం అధికారులకు వచ్చారు. వృద్ధ దంపతులు టికెట్ చూపించగా.. అందులోని పిఎన్ఆర్ నంబర్ మ్యాచ్ అవ్వలేదని ఈ టికెట్ చెల్లుబాటు కాదని, రూ.22,300 జరిమానా విధించారు. ఈ విషయాన్ని తమ కుమారుడు అలోక్ కుమారుడికి తెలుపగా.. అలోక్ సౌత్ వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వారు స్పందించకపోవడంతో వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ సంఘటనపై స్పందించిన వినియోగదారీ ఫోరం అధికారులు చీఫ్ బుకింగ్ ఆఫీసర్‌తో పాటు ఐఆర్సీటీసీ అధికారుల లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రైలులో ప్రయాణిస్తున్న వృద్ధ దంపతులకు జరిగిన అసౌకర్యానికి రూ. 40,000 నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అలోక్ కుమార్‌కు కోర్టు నష్టపరిహారం చెల్లించింది.