పార్లమెంట్ కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట

2024 పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-07-03 12:29 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కూటమిలోని పలువురు ఎంపీలతో పాటు బీజేపీ కీలక నేతలకు మోడీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ కొత్త కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో మరోసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు చోటు కల్పించింది. అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఉండగా.. పార్లమెంటరీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి చోటు దక్కింది. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అవకాశం కల్పించారు.

Tags:    

Similar News