Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్లలో రెండు రోజులు పార్కింగ్ సౌకర్యాలు బంద్
Parking Facility Call off at Delhi Metro Stations for 2 days| స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భద్రతా చర్యల దృష్ట్యా ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వాహనాల పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండవని, షెడ్యూల్ ప్రకారమే, మెట్రో రైలు సర్వీసులు కొనసాగుతాయని
దిశ, వెబ్‌డెస్క్: Parking Facility Call off at Delhi Metro Stations for 2 days| స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భద్రతా చర్యల దృష్ట్యా ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వాహనాల పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండవని, షెడ్యూల్ ప్రకారమే, మెట్రో రైలు సర్వీసులు కొనసాగుతాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తెలిపింది. భద్రతా చర్యల దృష్ట్యా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లలో రేపు ఉదయం 6:00 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల వరకు పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండవని పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అంతటా వాహనాల రాకపోకలు సాఫీగా ఉండేలా ఢిల్లీ పోలీసులు గురువారం ట్రాఫిక్ సలహాలను జారీ చేశారు. సాధారణ ట్రాఫిక్ కోసం వాణిజ్య రావాణాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఇండియా 75 ఏళ్ల స్వాతంత్య్రానికి అంతరిక్షం నుండి శుభాకాంక్షలు!