నీట్‌తో సహా అనేక పేపర్ లీక్స్..! ఏఐసీసీ చీఫ్ ఖర్గే సంచలన ఆరోపణలు

దేశంలో నీట్‌తో సహా అనేక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగంగా మారాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-06-07 08:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నీట్‌తో సహా అనేక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగంగా మారాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. దీనికి మోడీ సర్కార్ ప్రత్యక్ష బాధ్యత వహించాలని శుక్రవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా డిమాండ్ చేశారు.

అభ్యర్థులు పలు రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరవడం, ఆపై అనేక అవకతవకలను ఎదుర్కోవడం, పేపర్ లీకేజీల వల్ల చిక్కుల్లో చిక్కుకోవడం, ఇలా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలోని యువతను బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. నీట్, ఇతర పరీక్షలకు హాజరైన ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News