పానీపూరి లవర్స్‌కు షాక్.. త్వరలో పానీపూరి బంద్? రిపోర్ట్స్ ఆధారంగా బ్యాన్ చేసే అవకాశం!
పానీపూరి లవర్స్‌కు షాకింగ్ లాంటి వార్త.. త్వరలో తమిళనాడులో పానీ పూరిని నిషేధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: పానీపూరి లవర్స్‌కు షాకింగ్ లాంటి వార్త.. త్వరలో తమిళనాడులో పానీ పూరిని నిషేధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. పానీపూరి.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తినే స్నాక్. ముఖ్యంగా స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ పానీ పూరిని ఎక్కువగా తింటుంటారు. అయితే, కర్ణాటకలో కొన్ని షాపుల్లో పానీపూరిలో కెమికల్స్ కలుపుతున్నారని, అవి తింటే.. క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. కర్ణాటక నివేదిక ఇచ్చిన ఒక రోజు తర్వాత, ఫుడ్ సేఫ్టీ అధికారులు తమిళనాడు, చెన్నైలోని పానీ పూరి దుకాణాలపై దాడులు చేసి నమూనాలను సేకరించడం ప్రారంభించారు. 80కి పైగా షాపులపై ఈ బృందం దాడులు నిర్వహించగా వాటిలో చాలా వరకు పరిశుభ్రత లోపమేనని అధికారులు గుర్తించారు.
ఈ దాడిలో పానీపూరీ, మసాలా, చాట్, ఆహారంలో ఉపయోగించే ప్రాథమిక పదార్థాల నాణ్యతను విశ్లేషించి నమూనాలను సేకరించారు. ఫలితాలు రావడానికి 3-4 రోజులు పడుతుందని, ఏదైనా హానికరమైన పదార్థాలు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే పానీపూరి నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.