మంత్రాలు చదవాల్సిన నోటితో బూతులు తిట్టుకుంటున్న పండితులు.. అసలేం జరిగిందంటే..?
వేద మంత్రాలు చదవాల్సిన నోటితో పండితులు బూతులు తిట్టుకుంటున్నారు.
దిశ, ఫీచర్స్: వేద మంత్రాలు చదవాల్సిన నోటితో పండితులు బూతులు తిట్టుకుంటున్నారు. తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకులు గొడవకి దిగారు. అంతటితో ఆగకుండా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా తిట్టుకుంటూ ఉన్నారు.
ఈ గొడవ చూసిన ప్రజలు కూడా షాక్ అయ్యారు. వీళ్ళు అసలు మంత్రాలు చదివే వాళ్లేనా లేక వీధి రౌడీలా అంటూ చూస్తూ నిలబడిపోయారు. గొడవ ఆగేలా లేదని అక్కడున్న స్థానికులు పోలీసులకి సమాచారం అందివ్వడంతో, వారు రంగంలోకి దిగారు. అయిన కూడా ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. ఎదురుగా ఖాకీలను కూడా పట్టించుకోలేదు. ఈ గొడవను ఫోన్ లో రికార్డు చేసి పోస్ట్ చేసారు. ప్రస్తుతం వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
దేవాలయాల నగరంగా పేరొందిన కంచిలోని 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన కాంచీపురం దేవరాజ పెరుమాళ్ వైకాసి ప్రమోత్సవ వేడుకలను జరుపుకుంటారు. ఈ క్రమంలో గంగైకొండ మండపంలో మందగపడి కందల్లి వరదరాలను భక్తులకు ప్రసాదంగా అందజేసేటప్పుడు దత్తాచారి కుటుంబీకులు మంత్ర పుష్పం అనే వేద మంత్రాన్ని పఠించారు. అదే సమయంలో, దక్షిణ కళై బృందం వారు కూడా పాడతారని చెప్పడంతో విభేదించారు. చివరకు పోలీసులు పట్టించుకోవడంతో ఇరు వర్గాల వారు సైలెంట్ అయ్యారు.