Thripura local elections: త్రిపురలో ‘పంచాయతీ’ పోరు..71శాతం స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం
త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 71శాతం స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 71శాతం స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. గ్రామ పంచాయితీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లలో మొత్తం 6,889 స్థానాలకు గాను బీజేపీ 4,805 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం కార్యదర్శి అసిత్ దాస్ తెలిపారు. పోలింగ్ జరగనున్న 1,819 గ్రామ పంచాయతీ స్థానాల్లో బీజేపీ 1,809 స్థానాల్లో, సీపీఎం 1,222 స్థానాల్లో, కాంగ్రెస్ 731 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయని వెల్లడించారు. అలాగే బీజేపీ మిత్రపక్షమైన తిప్రమోత పార్టీ 138 స్థానాల్లో అభ్య ర్థులను ప్రకటించిందని చెప్పారు. పంచాయతీ సమితులలో మొత్తం 423 సీట్లలో బీజేపీ 235 సీట్లను అంటే 55 శాతం స్థానాలను పోటీ లేకుండా గెలుచుకుంది. అలాగే 116 జిల్లా పరిషత్ స్థానాలకు గాను 20 స్థానాలను బీజేపీ పోటీ కైవతసం చేసుకుంది. పోలింగ్ జరగనున్న మొత్తం 96 జిల్లా పరిషత్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టగా, సీపీఎం 81, కాంగ్రెస్ అభ్యర్థులు వరుసగా 81 స్థానాల్లో బరిలో నిలిచారు. కాగా, గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 96 శాతం సీట్లు గెలుచుకోవడం గమనార్హం.