పాక్ ఓడ ముంబైలో నిలిపివేత: అందులో సరుకు చూసి అధికారుల షాక్

చైనా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే ఓడను భారత భద్రతా బలగాలు ముంబైలోని నవా షెవా పోర్ట్ వద్ద నిలిపివేశాయి. పాకిస్థాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు వినియోగించే సరుకు ఓడలో ఉందన్న అనుమానంతో ఆపివేసినట్టు అధికారులు తెలిపారు.

Update: 2024-03-02 11:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే ఓడను భారత భద్రతా బలగాలు ముంబైలోని నవా షెవా పోర్ట్ వద్ద నిలిపివేశాయి. పాకిస్థాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు వినియోగించే సరుకు ఓడలో ఉందన్న అనుమానంతో ఆపివేసినట్టు అధికారులు తెలిపారు. సీఎంఏ, సీజీఎం అట్టిలా పేరుతో ఉన్న ఈ నౌకను నిఘా వర్గాల సమాచారం మేరకు జనవరి 23న నిలిపివేశారు. ఓడలో ఉన్న ఇటలీకి చెందిన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్‌సీ) యంత్రంతో కూడిన సరుకును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అలాగే ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) కూడా సరుకును పరిశీలించింది. పాక్ తన అణు కార్యక్రమానికి ఉపయోగించొచ్చని ధ్రువీకరించింది. పాకిస్థాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కీలకమైన భాగాలను తయారు చేయడానికి వీటిని ఉపయోగించొచ్చని తెలుస్తోంది. దీంతో ఆ సరుకును మొత్తం భారత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐరోపా, యూఎస్ నుంచి నిషేధించబడిన వస్తువులను పొందేందుకు పాకిస్తాన్ చైనాను ఒక మార్గంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. చైనా నుంచి పాక్‌కు రవాణా అవుతున్న డ్యూయల్ యూజ్ మిలిటరీ గ్రేడ్ వస్తువులను భారత్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే అనేక సార్లు ఈ తరహా పరికరాలను గుర్తించారు. కాగా, సీఎన్‌సీ యంత్రాన్ని ఉత్తర కొరియా తన అణు కార్యక్రమంలో ఉపయోగిస్తోంది. 

Tags:    

Similar News