ఇమ్రాన్‌కు 14 రోజుల కస్టడీ..? అట్టుడుకుతున్న పాక్.. ఇద్దరు మృతి
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 రోజుల రిమాండ్ విధించాలని కోర్టును నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఏన్ఏబీ) కోరింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 రోజుల రిమాండ్ విధించాలని కోర్టును నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఏన్ఏబీ) కోరింది. నాలుగైదు రోజుల రిమాండ్ తప్పదని ఎన్ఏబీ అధికారులు అంటున్నారు. విదేశాల నుంచి అందుకున్న ఖరీదైన బహుమతులను విక్రయించారన్న కేసులో అరెస్టు చేసిన ఇమ్రాన్‌ను ముగ్గురు ఏన్ఏబీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అధినేత ఇమ్రాన్‌ను అరెస్టు చేసినందుకు నిరసనగా పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ దేశ వ్యాప్త బంద్‌ను పాటిస్తోంది. పలు నగరాల్లో దుకాణాలు మూసేసిన పీటీఐ కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేపట్టారు.
పాకిస్తాన్ ఆర్మీహెడ్ క్వార్టర్స్ సహా భద్రతా సంస్థల స్థావరాలపైనా దాడి చేశారు. దేశమంతా అట్టుడుకుతుండటంతో ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వేలాది మంది పీటీఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించరాదని అమెరికా తమ దేశ పౌరులను కోరింది.