34 మంది పద్మశ్రీ పురస్కారాల విజేతలు వీరే
దిశ, నేషనల్ బ్యూరో : రిపబ్లిక్ డే వేళ కేంద్ర సర్కారు వివిధ రంగాలకు చెందిన 34 మందికి ‘పద్మ’ పురస్కారాలను అనౌన్స్ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : రిపబ్లిక్ డే వేళ కేంద్ర సర్కారు వివిధ రంగాలకు చెందిన 34 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి, తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య కూడా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డుల జాబితాను విడుదలచేయాల్సి ఉంది.
కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారాలు
* డి. ఉమామహేశ్వరి - ఆంధ్రప్రదేశ్
* గడ్డం సమ్మయ్య - తెలంగాణ
* దాసరి కొండప్ప - తెలంగాణ
* నారాయణన్ ఈపీ - కేరళ
* భాగబత్ పదాన్ - ఒడిశా
* సనాతన్ రుద్ర పాల్ - పశ్చిమ బెంగాల్
* భద్రప్పన్ ఎం - తమిళనాడు
* జోర్డాన్ లేప్చా - సిక్కిం
* జానకీలాల్ - రాజస్థాన్
* గోపీనాథ్ స్వైన్ - ఒడిశా
* స్మృతి రేఖ ఛక్మా - త్రిపుర
* ఓంప్రకాశ్ శర్మ - మధ్యప్రదేశ్
* మచిహన్ సాసా - మణిపుర్
* శాంతిదేవీ పాసవాన్, శివన్ పాసవాన్ - బిహార్
* రతన్ కహార్ - పశ్చిమ బెంగాల్
* అశోక్ కుమార్ బిశ్వాస్ - బిహార్
* బాలకృష్ణన్ సాధనమ్ పుథియ వీతిల్ - కేరళ
* బాబూ రామ్‌యాదవ్ - ఉత్తర్‌ప్రదేశ్
* నేపాల్ చంద్ర సూత్రధార్ - పశ్చిమ బెంగాల్
సామాజిక సేవా విభాగంలో పద్మశ్రీ పురస్కారాలు
* పార్బతి బారువా - అస్సాం
* సోమన్న - కర్ణాటక
* జగేశ్వర్ యాదవ్ - ఛత్తీస్‌గఢ్
* ఛామి ముర్మూ - ఝార్ఖండ్
* గుర్విందర్ సింగ్ - హరియాణా
*దుఖు మాఝీ - పశ్చిమ బెంగాల్
* సంగ్థాన్‌కిమా - మిజోరం
వైద్యవిభాగంలో పద్మశ్రీ పురస్కారాలు
* యజ్దీ మాణెక్ షా ఇటాలియా - గుజరాత్
* హేమచంద్ మాంఝీ - ఛత్తీస్‌గఢ్
* ప్రేమ ధన్‌రాజ్ - కర్ణాటక
క్రీడా విభాగంలో పద్మశ్రీ పురస్కారాలు
* ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే - మహారాష్ట్ర
ఇతర విభాగాలలో పద్మశ్రీ పురస్కారాలు
* సర్బేశ్వర్ బాసుమతరి - అస్సాం
* యనుంగ్ జామోహ్ లెగో - అరుణాచల్ ప్రదేశ్
* సత్యనారాయణ బెలేరి - కేరళ
* కె.చెల్లామ్మళ్ - అండమాన్ నికోబార్