BSF : జమ్మూపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. కీలక నిర్ణయం
దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో పలువురు సైనికులు అమరులయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో పలువురు సైనికులు అమరులయ్యారు. ఈనేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇండియా - పాకిస్తాన్ సరిహద్దులలో 2వేల మందికిపైగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిబ్బందిని మోహరించాలని బీఎస్ఎఫ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఒడిశాలోని మల్కాన్‌గిరిలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బందిలో 2వేల మందిని కశ్మీర్ సరిహద్దులకు పంపనున్నట్లు తెలుస్తోంది. తొలివిడతగా కశ్మీర్‌లోని రియాసీ, కిష్త్‌వార్, కథువాలలోని సరిహద్దు ప్రాంతాల్లో రెండు బీఎస్ఎఫ్ బెటాలియన్లను మోహరించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత కొన్నిరోజుల్లోనే మరో 2వేల మందికిపైగా సైనికులను జమ్మూ సరిహద్దుల్లో రంగంలోకి దింపనున్నారు.