Kargil Vijay Diwas: యూపీఏ రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్ని వాడుకుంది: జేపీ నడ్డా

ప్రతిపక్ష కాంగ్రెస్ తన హయాంలో సైన్యాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని ఆరోపణలు చేశారు.

Update: 2024-07-26 16:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం జరిగిన 25వ కర్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష కాంగ్రెస్ తన హయాంలో సైన్యాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని ఆరోపణలు చేశారు. అయినప్పటికీ వారు సైన్యానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ఇదే సమయంలో తాను 'వన్ ర్యాంక్, వన్ పెన్షన్‌'కు మద్దతిస్తున్నానని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆర్మీ సిబ్బంది 1971 నుంచే ఈ డిమాండ్ ఉంది. కానీ, వారు దాన్ని అమలు చేయలేదు. రూ. 500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించి వన్ ర్యాంక్, వన్ పెన్షన్‌ను తీసుకొస్తామని చెప్పారు. అయినప్పటికీ చేయలేదు. 2014లో ప్రధాని మోడీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఆ పథకాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో పాకిస్తాన్‌పై ఎదురుదాడి చేసే స్వేచ్ఛ సైనికులకు లేదని, 2014లో ప్రధాని మోడీ వచ్చాక పరిస్థితులు మారాయని జేపీ నడ్డా తెలిపారు. గతంలో తాను జమ్మూకశ్మీర్‌ను సందర్శించిన సమయంలో పాకిస్తాన్ చేసే దుశ్చర్యలకు ఎదురుదాడి చేసే స్వేచ్ఛ లేదని, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని సైనికులు చెప్పేవారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి చేసే స్వేచ్ఛ ఇచ్చారని, తద్వారా జమ్మూకశ్మీర్‌లో ఏ ఉగ్రవాది అయినా వారం కంటే ఎక్కువ రోజులు లేరని ఆయన వెల్లడించారు. 

Tags:    

Similar News