Judge Impeachment : హైకోర్టు జడ్జిపై అభిశంసన తీర్మానం.. రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు ‘ఇండియా’ నోటీసు
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఇది హిందుస్తాన్.. ఇక్కడ మెజారిటీ ప్రజల అభిమతమే నడుస్తుంది’’ అంటూ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై అభిశంసన తీర్మానాన్ని(Judge Impeachment) ప్రవేశపెట్టే దిశగా విపక్ష ఇండియా కూటమి కీలక ముందడుగు వేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఇది హిందుస్తాన్.. ఇక్కడ మెజారిటీ ప్రజల అభిమతమే నడుస్తుంది’’ అంటూ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై అభిశంసన తీర్మానాన్ని(Judge Impeachment) ప్రవేశపెట్టే దిశగా విపక్ష ఇండియా కూటమి కీలక ముందడుగు వేసింది. ఈ తీర్మానానికి సంబంధించిన నోటీసును కూటమికి చెందిన ఆరుగుల నేతల టీమ్ శుక్రవారం ఉదయం రాజ్యసభ(Rajya Sabha) సెక్రెటరీ జనరల్‌కు సమర్పించారు.
ఇండియా కూటమి నేతల టీమ్‌కు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సారథ్యం వహించగా, ఆయన వెంట కాంగ్రెస్ నేతలు వివేక్ తన్ఖా, దిగ్విజయ్ సింగ్, సీపీఎం నేత జాన్ బ్రిటాస్, ఆర్‌జేడీ నేత మనోజ్ కె.ఝా, టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఉన్నారు. ఈ తీర్మానంపై 55 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. విద్వేష ప్రసంగం చేయడంతో పాటు మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు యత్నించడం ద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారనే అభియోగాలను హైకోర్టు జడ్జిపై నమోదు చేశారు. ఈవివరాలను రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మీడియాకు వెల్లడించారు.