ఒకరు ఫోన్ ట్యాపింగ్.. మరోకరు లైంగిక వేదింపులు!.. నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

ఒక మంత్రి కొడుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే.. మరో మంత్రి కొడుకు అమ్మాయిల లైంగిక వేదింపులకు గురి చేసినట్లు తాను విన్నానని సినీ నటి పూనమ్ కౌర్ అన్నారు.

Update: 2024-04-29 15:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక మంత్రి కొడుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే.. మరో మంత్రి కొడుకు అమ్మాయిల లైంగిక వేదింపులకు గురి చేసినట్లు తాను విన్నానని సినీ నటి పూనమ్ కౌర్ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ ఘటనపై స్పందిస్తూ.. ఆయన 2800 మంది మహళలను లైంగిక వేదింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఓ మంత్రి కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ 2800 మంది బలవంతంగా అశ్లీల వీడియోలు తీశారని, వాళ్లకి డబ్బు, అధికారం రెండు ఉన్నాయని, వాళ్లని మన ప్రభుత్వం ఏమి చేయలేదని, ఇప్పుడు అతను జర్మనీలో ఉన్నారని చెప్పుకొచ్చారు.

అంతేగాక అతనికి శిక్ష పడుతుందా లేదా అని కూడా చెప్పలేమని అన్నారు. మీరందరికీ చెతులు జోడించి ప్రార్ధన చేస్తున్నానని, మీ కూతుర్ల మీద, మీ సోదరీమణుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా దయచేసి ఓటు వేయాలని కానీ ఇలాంటి మహిళలను వేదించే వారికి, స్త్రీలను గౌరవించని వారికి ఓటు వేయోద్దని అభ్యర్ధించారు. అలాగే 2800 మంది మహిళల వీడియోలు తీసిన ప్రజ్వల్ రేవణ్ణని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని కోరారు. అంతేగాక ఈ దేశంలో రావణ రాజ్యం రావాలా?, రామ రాజ్యం రావాలా? అనేది మీ చేతుల్లోనే ఉందని పూనమ్ కౌర్ అన్నారు.

Tags:    

Similar News