చాలా మంది పిల్లలు అని లాలూపై నితీశ్ ఫైర్.. కౌంటర్ ఇచ్చిన తేజస్వి
బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీఅధినేత లాలూ ప్రసాద్ పై విమర్శుల గుప్పించారు. లాలూ మంది పిల్లలకు జన్మనిచ్చారని, వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీఅధినేత లాలూ ప్రసాద్ పై విమర్శుల గుప్పించారు. లాలూ మంది పిల్లలకు జన్మనిచ్చారని, వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు. శనివారం కతిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నితీశ్ కుమార్ మాట్లాడారు.
ప్రస్తుతం తన పిల్లలను లాలూ ప్రమోట్ చేస్తున్నారని నితీశ్ కుమార్ విమర్శించారు. ‘నువ్వు చాలా మంది పిల్లలను కన్నావు. ఇంత మంది పిల్లలకు జన్మనివ్వడం అవసరమా? ఎవరైనా చాలా మంది పిల్లలను కంటారా?’ అని ప్రశ్నించారు. అయితే ఈ కామెంట్స్ చేసేటప్పుడు లాలూ పేరుని వాడకపోయినా.. పరోక్షంగా లాలూని ఉద్దేశించే అన్నారని తెలుస్తోంది. చాలా మంది పిల్లలకు ఆయన జన్మనిచ్చారని, వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు. తన కుటుంబ సభ్యులను మాత్రమే లాలూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు ప్రస్తుతం తన కుమార్తెలు, ఇద్దరు కుమారులు, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని రాజకీయాల్లోకి లాలూ తీసుకువచ్చారని నితీశ్ కుమార్ విమర్శించారు. వారు ప్రతిచోటా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారని మండిపడ్డారు. ప్రజలు అభివృద్ధి చెందలేకపోయారని.. రోడ్లు కాని విద్య కాని లేవని వారసత్వ రాజకీయాలపై మండిపడ్డారు.
అయితే, నితీశ్ వ్యాఖ్యలపై లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ స్పందించారు.ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు బిహార్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయా అని నితీశ్ ను ప్రశ్నించారు. ఆయన తమతో ఏం మాట్లాడినా ఆశీర్వాదం లాంటిదే అని అన్నారు. కానీ, వ్యక్తిగత వ్యాఖ్యలు కాకుండా ఎన్నికల్లో అంశాలు చర్చకు రావాలని అన్నారు. విద్య, ఉపాధి, వలసలను అరికట్టడంపై ఆయన మాట్లాడాలా? అని ప్రశ్నించారు. సీఎం ఏం చెప్పాలనుకున్నారో ప్రజలు చూశారని మండిపడ్డారు లాలూ కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ అభ్యర్థి మిసా భారతి. మోడీ వంశరాజకీయాలపై మాట్లాడటం మానేశారని.. ఇప్పుడు మామయ్య(లాలూ) మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బిహార్ లోని 40 లోక్ సభ స్థానాలుండగా.. బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనుంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ ఐదు స్థానాల్లో పోటీ చేయనుంది.