దేశ అభివృద్ధికి ఉచిత విద్య, వైద్యమే ముఖ్యం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఉచిత విద్య, వైద్యమే దేశ అభివృద్ధికి ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. Latest Telugu News

Update: 2022-08-15 12:42 GMT

న్యూఢిల్లీ: ఉచిత విద్య, వైద్యమే దేశ అభివృద్ధికి ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సంక్షేమ పథకాలను ఉచితాలుగా పేర్కొనలేమని చెప్పారు. సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో కేవలం ఒక్క తరంలోనే పేదరికాన్ని తుడిచి పెట్టొచ్చని అన్నారు. విద్యా సంస్కరణలతో ఢిల్లీలో పేదవాడి కొడుకు న్యాయవాది లేదా ఇంజనీర్ అవ్వాలనే కలను నిజం చేసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో ఆసుపత్రుల సదుపాయాలు మెరుగుపరిచి, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సరైన వైద్య సదుపాయాన్ని కల్పించడం ఉచితాల కిందికి రాదని అన్నారు. కొన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచితాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని ప్రధాని మోడీ గతంలో అన్నారు. అంతేకాకుండా ఉచితాలు ఇస్తే ఎయిర్ పోర్టులు, రోడ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్షాలు, కేంద్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

నేతాజీ అస్థికలు తీసుకురండి: అనితా బోస్ 

Tags:    

Similar News