Breaking News : ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ అరెస్ట్
సంచలనం రేపిన ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్(CGPSC) ఉద్యోగాల కుంభకోణంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : సంచలనం రేపిన ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్(CGPSC) ఉద్యోగాల కుంభకోణంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో కమిషన్ మాజీ ఛైర్మన్ తమన్ సింగ్ సోన్వానీ(Taman Singh Sonvani) ని సీబీఐ(CBI) అరెస్ట్ చేసింది. 2020-2022లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో జరిగిన భారీ ఉద్యోగ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కుంభకోణంలో అప్పటి ఛైర్మన్ తమన్ సింగ్ సోన్వానీ.. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులు, అధికారుల పిల్లలను ఉన్నత అధికారులుగా నియమించేందుకు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. సోమవారం ఉదయం తమన్ నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్ట్ చేశారు. కాగా సోదాల్లో పలు కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరింతమంది అరెస్ట్ కానున్నట్టు సమాచారం.