Olympic Commentator: కవరేజ్ నుంచి కామెంటేటర్ తొలగింపు

ఒలింపిక్స్ కవరేజ్ నుంచి కామెంటేటర్ బాబ్ బల్లర్డ్ ను యూరో స్పోర్ట్ తొలగించింది. ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్లు ఆదివారం 4x100 ఫ్రీస్టైల్‌ రిలేలో స్వర్ణం సాధించారు.

Update: 2024-07-29 04:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒలింపిక్స్ కవరేజ్ నుంచి కామెంటేటర్ బాబ్ బల్లర్డ్ ను యూరో స్పోర్ట్ తొలగించింది. ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్లు ఆదివారం 4x100 ఫ్రీస్టైల్‌ రిలేలో స్వర్ణం సాధించారు. ఈ సందర్భంగా వారి గెలుపును ప్రకటిస్తూ బాబ్‌ కామెంటింగ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దుమారం రేగింది. దీనిపై స్పందించిన యూరోస్పోర్ట్ యాజమాన్యం.. కామెంటరీలో బల్లర్డ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించింది. దీంతో, ఆయన్ని విధుల నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, బల్లర్డ్ నుంచి మాత్రం ఏ విధమైన స్పందన రాలేదు. స్మిమ్మింగ్‌లో 4x100m ఫ్రీస్టైల్ రిలేను 3:28:92 నిమిషాల్లో పూర్తి చేసిన ఆస్ట్రేలియా మహళల బృందం బంగారు పతకాన్ని కైసం చేసుకుంది. అమెరికా, చైనా తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఈ ఈవెంట్‌లో తొలిస్థానంలో నిలవడం ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. 


Similar News