కేంద్ర మంత్రిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ లు.. కేసు నమోదు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆయనను ఉద్దేశించి పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిపై నితిన్ గడ్కరీ కార్యాలయం ఫిర్యాదు చేసిందని, ఈ క్రమంలోనే కేసు నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై తమ సైబర్ సెల్ కేసు నమోదు చేసినట్లు నాగ్‌పూర్ పోలీసులు సోమవారం తెలిపారు. వాట్సప్ గ్రూప్ లలో సర్క్యులేట్ అయిన పోస్టుల్లో నిందితుడు దత్తాత్రేయ జోషి గడ్కరీని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని వారు నిర్ధారించారు. దీంతో నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.