West Bengal: ఆరోగ్య మంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: సువేందు అధికారి

వారంతా ఈ పాశవికానికి ప్రధాన బాధ్యులు అని అన్నారు.

Update: 2024-08-13 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్‌జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం-హత్య ఘటనపై కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ కేసులో ముఖ్యమంత్రి, పోలీసు కమిషనర్, ఇతరులను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారంతా ఈ పాశవికానికి ప్రధాన బాధ్యులు అని అన్నారు. ' నేను హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని నేను మొదటి రోజు నుంచి చెబుతున్నాను' అని సువేందు తెలిపారు. అలాగే కోల్‌కతా సీపీ వినీత్ గోయల్, డాక్టర్ సందీప్ ఘోష్ (ఆర్‌జి కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్)లను అరెస్టు చేయాలని మేము కోరుతున్నాం. వారు ఈ దారుణానికి ప్రధాన కారకులు. ఇది క్రూరమైన హత్య, సామూహిక అత్యాచారం అని సువేందు అన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. ఒక మెడికల్ క్యాంపస్‌లో వైద్యం చేసే డాక్టర్‌కు ఇలా జరగడం తీవ్రమైన సమస్య. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. మరో కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్.. పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని విమర్శలు చేశారు. బెంగాల్‌లో ఇది మొదటిది కాదు, చివరిది కాదు. శాంత్రిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయి. పోలీసులు టీఎంసీ నాయకులను రక్షిస్తున్నారు. సఘంటనపై సాక్ష్యాధారాల సేకరణ కోసం కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు పంపాలని పేర్కొన్నారు.  

Tags:    

Similar News