ప్రధాని కావాలని ఆశ లేదు.. ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లో ప్రధాని కావాలని తాను కలగనట్లేదని చెప్పారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మార్పును తీసుకువస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాని మోడీకి లేఖ రాశాం. కేంద్ర సంస్థలు విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించింది. ఇదే ధోరణిలో బీజేపీ ప్రవర్తిస్తుంది. సమయం మారినప్పటికీ వీరు కూడా పతనానికి గురౌతారు’ అని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు శూన్యమని చెప్పారు.