చైనాతో ద్వైపాక్షిక సంబంధాల గురించి భారత్ ఏమందంటే?

భారత్- చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పరస్పర గౌరవంతోనే సంబంధాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది.

Update: 2024-06-08 18:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పరస్పర గౌరవంతోనే సంబంధాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది. మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్న మోడీకి చైనా అభినందనలు తెలిపింది. అయితే, చైనా చేసిన ట్వీట్ పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. నరేంద్రమోడీకి అభినందనలు తెలిపిన చైనాకు ధన్యవాదాలు అని పేర్కొంది. పరస్పర గౌరవం, ఆసక్తి, సెన్సిటివిటీ పైనే భారత్-చైనా సంబంధాలను సాధారణీకరించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపింది. ఈ విషయాన్నే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇకపోతే, తూర్పు లడఖ్‌లోని ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆ తర్వాత నుంచే భారత్-చైనా మధ్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఆ ఉద్రిక్తతలను ఉద్దేశించే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కామెంట్లు చేసింది.


Similar News