Omar Abdullah : ప్రజలను లాఠీతో బెదిరించొద్దు.. పోలీసులకు సీఎం ఒమర్ తొలి ఆదేశం

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం పోలీసులకు ఒమర్ అబ్దుల్లా కీలకమైన తొలి ఆదేశం జారీ చేశారు.

Update: 2024-10-16 12:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం పోలీసులకు ఒమర్ అబ్దుల్లా కీలకమైన తొలి ఆదేశం జారీ చేశారు. వీఐపీల పర్యటనల సమయంలో ప్రజలకు ఎదురయ్యే అసౌకర్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించాలని ఆయన ఆర్డర్ ఇచ్చారు. ప్రజలు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే.. లాఠీని చూపించి వారిని బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించడం ఆపేయాలని పోలీసులకు నిర్దేశించారు. సీఎంగా తన రాకపోకల కోసం ట్రాఫిక్ లేని గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కశ్మీరు పోలీసులకు ఒమర్ అబ్దుల్లా సూచించారు.

తన పర్యటనల వల్ల ట్రాఫిక్ స్తంభించి ప్రజలకు అసౌకర్యం కలగకూడదన్నారు. జమ్మూకశ్మీర్ మంత్రి మండలిలోని సభ్యులంతా ఇదే విధమైన నైతిక నియమావళిని పాటించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ‘‘ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ మనం ప్రభుత్వాన్ని నడపాలి. ప్రజలకు సేవ చేయాలి. అంతేతప్ప వారికి అసౌకర్యాన్ని కలిగించకూడదు’’ అని సీఎం ఒమర్ వ్యాఖ్యానించారు. ఈమేరకు వివరాలతో ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. 


Similar News