భారత్‌లో ఏ మతానికి ముప్పు లేదు: NSA Ajit Doval
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఏ మతానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ మంగళవారం అని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఏ మతానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే "ఇస్లాంలోని సహకారం, సంభాషణ యొక్క తత్వశాస్త్రం శతాబ్దాలుగా పురాతన హిందూ నాగరికత సంప్రదాయంతో సజావుగా విలీనమైంది" అని ఆయన చెప్పారు. "సుమారు 200 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నప్పటికీ, ప్రపంచ ఉగ్రవాదంలో భారతీయ పౌరుల ప్రమేయం చాలా తక్కువగా ఉంది" అని దోవల్ అన్నారు. ఈ ఈవెంట్‌కు ఈ కార్యక్రమంలో ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ మహమ్మద్ బిన్ అబ్దుల్కరీమ్ అల్-ఇస్సా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం సహజీవనానికి ఒక నమూనా అని, ప్రతి భారతీయ ముస్లిం గర్వించదగిన పౌరుడు, దేశభక్తుడని అన్నారు.