దోషులను సత్కరించడాన్ని సమర్థించను.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. .Latest Telugu News
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తికి సత్కారాన్ని సమర్థించడం సరైన చర్య కాదని అన్నారు. భందరా జిల్లాలో 35 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేసిన విషయాన్ని మంగళవారం ఆయన శాసనమండలిలో లేవనెత్తారు.
సభలో బిల్కిస్ బానో అంశాన్ని లేవనెత్తడానికి ఎలాంటి కారణాలు లేవని అన్నారు. 'నిందితులు దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్నాక విడుదలయ్యారు. కోర్టు ఆదేశాల తర్వాతే బయటకు వచ్చారు. అయితే జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని సత్కారించడం సరైన చర్య కాదు. నిందితుడు నిందితుడే.. దీనికి ఎలాంటి సమర్థన ఉండదు' అని అన్నారు.
దేశవ్యాప్తంగా బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారు జైలు నుంచి విడుదలయ్యాక సన్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది.