Delhi: చట్టవిరుద్ధమైన ఏ కోచింగ్ సెంటర్‌ను వదిలిపెట్టేదిలేదు: ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్

విద్యార్థులను బలిగొన్న ఘటనపై ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Update: 2024-07-29 19:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో వరదనీరు చేరి ముగ్గురు విద్యార్థులను బలిగొన్న ఘటనపై ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం ఓ ప్రకటనలో మాట్లాడిన ఆమె.. సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని, పరిస్థితిని అంచనా వేసినట్టు చెప్పారు. తక్షణం ఎంసీడీ కమిషనర్‌కు లేఖ రాసి దర్యాప్తుకు ఆదేశాలు జారి చేసినట్టు తెలిపారు. అలాగే, చట్టవిరుద్ధంగా కోచింగ్ సెంటర్లను నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని, ఎవరూ తప్పించుకోకూడదని ఆమె స్పష్టం చేశారు. అనంతరం ఓల్డ్ రాజెందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా సీల్ వేసినట్టు ఆమె వివరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముఖర్జీ నగర్‌లో ఓ జూనియర్ ఇంజనీర్‌ను తొలగించామని, మరో అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసినట్టు షెల్లీ ఒబెరాయ్ వెల్లడించారు.

Tags:    

Similar News