జనవరి 1 వరకు ఎలాంటి బెంచ్‌లు ఉండవు: CJI DY Chandrachud

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక విషయాన్ని వెల్లడించారు. శనివారం నుంచి జనవరి 1 వరకు శీతాకాల సెలవుల కారణంగా

Update: 2022-12-16 09:28 GMT

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక విషయాన్ని వెల్లడించారు. శనివారం నుంచి జనవరి 1 వరకు శీతాకాల సెలవుల కారణంగా ఎలాంటి బెంచ్‌లు అందుబాటులో ఉండవని చెప్పారు. న్యాయాభిమానులకు సుదీర్ఘ కోర్టు సెలవులు అంత అనుకూలం కాదనే భావన ప్రజల్లో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభలో చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం చివరి పనిదినమని, జనవరి 2న సుప్రీంకోర్టు తెరుచుకుంటుందని చెప్పారు. గతంలో కోర్టు సెలవులపై జడ్జిలతో పాటు సీజేఐ ఎన్వీ రమణ ఆందోళన లేవనెత్తారు. సెలవులతో జడ్జిలు సౌలభ్యవంతంగా అనుభవిస్తారనే అపోహ ఉందని చెప్పారు.

Tags:    

Similar News