పాట్నా: 2024లో ప్రధాని అభ్యర్థిగా తన పేరును ఎత్తిచూపడం పై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. తనకు ప్రధాని కావాలని కోరిక లేదని అన్నారు. అంతేకాకుండా దానికి సంబంధించిన నినాదాలు కూడా చేయొద్దని తన మద్దతుదారులకు సూచించారు. 2024 ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారా అని నితీశ్‌ను ప్రశ్నించగా పక్కనే ఉన్న మహఘట్‌బంధన్ మద్దతుదారులు భావి పీఎం నితీశ్ అంటూ నినాదాలు చేశారు. అయితే అలాంటి కోరికలు తనకు లేవని చెప్పారు. అంతకుముందు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థి అనే వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన దృష్టి మొత్తం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేయడం పై ఉందని చెప్పారు. ఈ మధ్య తేజస్వీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌లను కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలను ఏకం చేయడంలో ఇరువురు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మరోవైపు మహఘట్ బంధన్‌కు నితీశ్ గుడ్ బై చెబుతున్నారన్న కథనాలపై బిహార్ సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Nitish Kumar Asks Supporters Not To Project Him As 2024 PM Candidate
Also Read...
కాబోయే ప్రధాని నితీశ్ కుమారేనా...? క్లారిటీ ఇచ్చిన బీహార్ సీఎం