Nipah : నిఫా మృతుడి పేరెంట్స్‌కు నెగెటివ్.. ఆరోగ్యశాఖ నివేదిక
దిశ, నేషనల్ బ్యూరో : నిఫా వైరస్ సోకి ఈనెల 21న బాలుడు(14) మృతిచెందిన చెందిన ఘటనతో కేరళ హైఅలర్ట్‌పై ఉంది.
దిశ, నేషనల్ బ్యూరో : నిఫా వైరస్ సోకి ఈనెల 21న బాలుడు(14) మృతిచెందిన చెందిన ఘటనతో కేరళ హైఅలర్ట్‌పై ఉంది. ఆ బాలుడి కుటుంబీకులు, వారితో సన్నిహితంగా మెలిగిన ఇరుగుపొరుగువారిని రాష్ట్ర ప్రభుత్వం హై-రిస్క్ కేటగిరీలో చేరింది. మృతుడి కుటుంబం కాంటాక్ట్ లిస్టులోని దాదాపు 406 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.
వారిలో పలువురి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి టెస్టులు చేయించగా.. మంగళవారం 9 మందికి నెగెటివ్ వచ్చింది. ఈ జాబితాలో బాలుడి పేరెంట్స్‌తో పాటు పాలక్కడ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు సన్నిహితులు ఉన్నారు. కాంటాక్ట్ లిస్టులోని మరికొందరి టెస్టుల ఫలితాలు మరో 24 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఈవివరాలను కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విలేకరులకు వెల్లడించారు.