NIA: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు.. ఆ తీవ్రవాద సంస్థపై ఉక్కుపాదం
తీవ్రవాద సంస్థలను తుదముట్టించమే లక్ష్యంగా ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 30 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: తీవ్రవాద సంస్థలను తుదముట్టించమే లక్ష్యంగా ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 30 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలా, బాన్ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కు చెందిన పలువురు అనుమానితులతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ నెక్సస్ కేసులో ఎన్‌ఐఏ నిన్న అర్ధరాత్రి వరకు 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలోని 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఎన్‌ఐఏ బృందాలు దాడులు నిర్వహించాయి. ఉగ్రవాది దాలాతో పాటు బల్జీత్ మౌర్, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్‌లకు సంబంధించిన అనుమానిత సహచరులు ఎన్‌ఐఏ హిట్ లిస్టులో ఉన్నారు. అయితే, ఈ దాడుల్లో డిజిటల్ పరికరాలతో సహా మరికొన్ని వస్తువులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుంది.