రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్.. దూకుడు పెంచిన NIA
కర్నాటక రాజధాని బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దూకుడు పెంచింది.
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక రాజధాని బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ బుధవారం తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్ల ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల బెంగళూరులోని ఫేమస్ రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. దుండగుడు కేఫ్‌లో టైమ్ బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఈ కేసులో ఉగ్రవాద కోణం వెలుగులోకి రావడంతో ఎన్ఐఏ రంగంలోకి దర్యాప్తు చేస్తోంది.