Governor : గవర్నర్ పదవులు అలంకారప్రాయం కావు : గవర్నర్ గులాబ్‌చంద్ కటారియా

దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్ నూతన గవర్నర్ గులాబ్‌చంద్ కటారియా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-31 16:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్ నూతన గవర్నర్ గులాబ్‌చంద్ కటారియా కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవులు అలంకారప్రాయమైనవి కావని.. వాటి ద్వారా ప్రజలకు చేయాల్సిన సేవ చాలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘‘రాష్ట్రపతి నాకు పంజాబ్ బాధ్యతను అప్పగించారు. ఒక మంచి ప్రజా సేవకుడిగా నా కార్యాలయ బాధ్యతలను నెరవేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను’’ అని కటారియా చెప్పారు. బుధవారం గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.

‘‘గత 40-45 ఏళ్లుగా ప్రజాసేవ చేయడమే ధర్మంగా భావిస్తూ ముందుకుసాగాను. ఇకపైనా సామాన్యుల సమస్యల పరిష్కారానికి నావంతుగా సహకరిస్తాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీచేసినా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం కదా’’ అని కటారియా తెలిపారు. పంజాబ్ రాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పంజాబ్ , హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు.. కటారియాతో గవర్నర్‌గా ప్రమాణం చేయించారు.

Tags:    

Similar News