ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలు అడ్డుకునేందుకు.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం!
గుజరాత్ ప్రభుత్వం ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది.
గాంధీనగర్: గుజరాత్ ప్రభుత్వం ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో సమస్యగా పేపర్ లీక్ అంశాన్ని నియంత్రించేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే రూ.కోటి జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో గుజరాత్ ప్రభుత్వం ఉంది. దీనికి గానూ బడ్జెట్ సెషన్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలు అడ్డుకునేందుకు.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం!ఈ మేరకు గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (అన్యాయ నివారణ) బిల్లును ప్రతిపాదించింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే కనీసం ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, రూ.10 లక్షలకు తగ్గకుండా జరిమానా విధించేలా నిర్ణయించింది. అంతేకాకుండా అభ్యర్థులను రెండేళ్ల పాటు ఎలాంటి ప్రభుత్వ నియామక పరీక్షలు రాయకుండా నిషేధం విధించేలా తీర్మానం చేసింది. కాగా, ఈ నెల 23 నుంచి గుజరాత్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.