నీట్-యూజీ పరీక్షల్లో 63 మంది డిబార్ : ఎన్‌టీఏ

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన కీలక సమాచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.

Update: 2024-06-23 18:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన కీలక సమాచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా నీట్ -యూజీ పరీక్షా కేంద్రాల నుంచి 63 మంది అభ్యర్థులను డిబార్ చేసినట్లు వెల్లడించింది. బిహార్‌లోని నీట్ పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయిన 17 మంది డిబార్ అయ్యారని తెలిపింది. గుజరాత్‌లోని గోద్రాలో ఏర్పాటుచేసిన నీట్ పరీక్షా కేంద్రాల నుంచి అత్యధికంగా 30 మంది అభ్యర్థులు డిబార్ అయ్యారని ఎన్‌టీఏ పేర్కొంది.

వెబ్‌సైట్ హ్యాక్ కాలేదు : ఎన్‌టీఏ

ఎన్‌టీఏ వెబ్‌సైట్ కానీ దాని అనుబంధ పోర్టల్స్ కానీ హ్యాకింగ్ బారినపడలేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ తప్పుదోవ పట్టించే వదంతులే అని వెల్లడించింది. ఎన్‌టీఏ వెబ్‌సైట్, దాని అన్ని వెబ్ పోర్టల్స్ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని తెలిపింది.


Similar News