SC advocate: సత్వర న్యాయం కోసం శిక్షణ పిందన సిబ్బంది అవసరం

సత్వర తీర్పుల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గీతా లుత్రా స్పందించారు.

Update: 2024-09-03 04:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సత్వర తీర్పుల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గీతా లుత్రా స్పందించారు. దాని కోసం సెక్రటేరియట్ సహా శిక్షణ పొందిన సిబ్బంది అవసరమని వ్యాఖ్యానించారు. ఛార్జిషీట్ల దాఖలులో జాప్యం వల్ల సత్వర న్యాయం జరగట్లేదన్నారు. కొన్ని కేసులు నాలుగు నుంచి పదిహేడేళ్ల వరకు పెండింగ్ లోనే ఉంటున్నాయన్నారు. దీన్ని నివారించడానికి క్రిమినల్ కేసులకు పరిమితుల శాసనాన్ని ప్రవేశపెట్టాలని ఆమె వాదించారు. ఛార్జిషీట్‌లు ఆలస్యంగా దాఖలు చేస్తే.. సాక్ష్యాధారాలను కోల్పోవాల్సివస్తుందన్నారు. దీంతో, నిందితుడు తప్పించుకోగలగుతాడని పేర్కొన్నారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం కంటే సుశిక్షితులైన సెక్రటేరియట్, సమర్థమంతమైన కేసు నిర్వహణతో సహా మెరుగైన కోర్టు పరిపాలన అవసరమని నొక్కి చెప్పారు. మరో సినియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే న్యాయవ్యవస్థ, కేసుల నిర్వహణను సమర్థించారు. ప్రాథమిక సమస్య మౌలిక సదుపాయాలే అని చెప్పారు. న్యాయ వ్యవస్థకు మద్దతుగా ప్రభుత్వం తగిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని దూబే అన్నారు.

రాష్ట్రపతి ఏమన్నారంటే?

సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు చాలా ఆలస్యంగా తీర్పులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, బ్యాక్‌లాగ్‌ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.


Similar News