ముంబై హైకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు..

Update: 2023-03-29 14:22 GMT

న్యూఢిల్లీ: ముంబై హై కోర్టులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చుక్కెదురైంది. 2022లో ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని అవమానపరిచిన కేసులో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ఫిర్యాదులో ఆమెకు ఎటువంటి ఉపశమనమూ లభించలేదు. 2023 జనవరిలో ఈ విషయంపై తిరిగి విచారణ జరపమని మేజిస్ట్రేట్ కోర్టుకు పంపుతూ సెషన్స్ కోర్టు సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ మమతా దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ అమిత్ బోర్కర్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. సెషన్స్ కోర్టు సమన్లు రద్దు చేసే బదులుగా.. మొత్తం ఫిర్యాదునే రద్దు చేయాలని మమత తన దరఖాస్తులో పేర్కొన్నారు.

ఓ సమాజ సేవకుడు వివేకానంద గుప్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2022 మార్చిలో మేజిస్ట్రేట్ కోర్టు మమతకు సమన్లు జారీ చేసింది. ముంబైలోని యశ్వంత్‌రావ్ చవాన్ ఆడిటోరియంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని ఆమె కూర్చొని ఆలపించారని.. తర్వాత నిల్చుని రెండు వచనాలు మాత్రం పాటి వెళ్లిపోయారని గుప్త తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మేజిస్ట్రేల్ కోర్టు సమన్లను మమత స్పెషల్ కోర్టులో సవాల్ చేశారు. ప్రత్యక న్యాయమూర్తి ఆర్ఎన్ రోకడే 2023 జనవరిలో విధానపరమైన కారణాలపై మెజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను పక్కన పెట్టారు. ఫిర్యాదును పునః పరిశీలించాల్సిందిగా మేజిస్ట్రేట్‌ను కోరారు.

Tags:    

Similar News