Arvind Kejriwal : నరేంద్రమోడీ చాలా పవర్‌ఫుల్.. దేవుడైతే కాదు : అరవింద్ కేజ్రీవాల్

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-26 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని మోడీ చాలా పవర్‌ఫుల్ అని నేను నిత్యం చెబుతుంటాను. ఎందుకంటే ఆయన వద్ద చాలా వనరులు ఉంటాయి. అంత మాత్రాన మోడీ ఏం దేవుడు కాదు. దేవుడు మాతోనే ఉన్నాడు. న్యాయాన్ని కాపాడినందుకు సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

మనీశ్ సిసోడియాను, తనను సభలో తిరిగి చూస్తున్నందుకు విపక్ష సభ్యులకు విచారంగా ఉందేమో అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. అంతకుముందు గురువారం ఉదయం సీఎం అతిషితో కలిసి ఢిల్లీలో దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. ఇప్పుడు తాను జైలు బయట ఉన్నందున పెండింగ్ అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయిస్తానన్నారు. రోడ్ల మరమ్మతులపై ఫోకస్ చేస్తానని తెలిపారు. 


Similar News