Naana Patole: ప్రధాని మోడీనే అవినీతి కింగ్..మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందించారు.

Update: 2024-07-22 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే స్పందించారు. ప్రధాని మోడీనే అవినీతిలో కింగ్ అని అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో శరద్ పవార్‌ను ఎన్డీయే ప్రభుత్వం స్వయంగా పద్మవిభూషణ్‌తో సత్కరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనను అవినీతిపరుడని ఎలా పిలుస్తున్నారని అమిత్ షాను ప్రశ్నించారు. అవినీతికి పెద్ద కింగ్ మోడీయేనని విమర్శించారు. మహారాష్ట్రలో అధికారం కోల్పోతామని బీజేపీ భయపడుతోందన్నారు.

మరాఠాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కల్పించడంలేదో సమాధానం చెప్పాలన్నారు. ‘105 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలకు పొరపాటుగా భావిస్తున్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు’ అని ప్రశ్నించారు. ధారావి పునరాభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తూ..పెద్ద ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి గుజరాత్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల విలువైన భూములు బీజేపీ నేతల ఇష్టారాజ్యంగా లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. కాగా, భారత రాజకీయాల్లో అవినీతికి పవార్‌ సూత్రధారి అని అమిత్ షా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే నానా పటోలే స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News