వాళ్లు నన్ను శతాబ్దాల తరబడి ఆశీర్వదిస్తారు : మోడీ

దిశ, నేషనల్ బ్యూరో : ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ తాము తీసుకొచ్చిన చట్టం వల్ల ఎంతోమంది ముస్లిం మహిళలు, వారి కుటుంబాలకు కష్టాలు తొలగిపోయాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.

Update: 2024-04-06 17:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ తాము తీసుకొచ్చిన చట్టం వల్ల ఎంతోమంది ముస్లిం మహిళలు, వారి కుటుంబాలకు కష్టాలు తొలగిపోయాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దీనిపై చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు శతాబ్దాల పాటు ముస్లిం మహిళల ఆశీర్వాదం తనకు లభిస్తుందని ఆయన చెప్పారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం ప్రాబల్య నగరం సహరన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందించడమే నిజమైన లౌకికవాదమని మోడీ చెప్పారు. ‘‘ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం వల్ల కేవలం ముస్లిం మహిళలే లబ్ధి పొందారని కొందరు అంటున్నారు. వాస్తవానికి ముస్లిం మహిళలతో పాటు వారి తల్లిదండ్రులు, సోదరులకు కూడా ఊరట లభించింది’’ అని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. బీజేపీతో ఆర్‌ఎల్‌డీ చేతులు కలిపింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో సమాజ్ వాదీ పార్టీ జట్టు కట్టింది.

Tags:    

Similar News