ప్రపంచంలోనే సంపన్నుడిపై మోడీ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : ఈనెలలో టెస్లా, ట్విట్టర్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ భారత్‌లో పర్యటించనున్నారు.

Update: 2024-04-15 12:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈనెలలో టెస్లా, ట్విట్టర్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాన్ మస్క్.. మోడీకి మద్దతుదారుడు అనేది ఓ విషయం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్ బేసిక్‌గానే మన దేశానికి బలమైన మద్దతుదారుడు’’ అని ప్రధాని పేర్కొన్నారు. సోమవారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో టెస్లా కార్ల విక్రయాలు, స్టార్‌లింక్‌ సేవల గురించి ప్రశ్నించగా.. మోడీ పైవిధంగా సమాధానమిచ్చారు. ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈసారి ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా భారత్‌లో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించే అంశాన్ని ఎలాన్ మస్క్ డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. స్టార్‌లింక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది వినియోగదారులకు అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

Tags:    

Similar News