మెట్రో రైలులో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము: వైరల్‌గా మారిన వీడియోలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఫరీదాబాద్‌లోని కాశ్మీర్ గేట్, రాజా నహర్ సింగ్ మధ్య నడిచే రైలులో ఎల్లోలైన్‌లోని

Update: 2024-02-07 10:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఫరీదాబాద్‌లోని కాశ్మీర్ గేట్, రాజా నహర్ సింగ్ మధ్య నడిచే రైలులో ఎల్లోలైన్‌లోని సెంట్రల్ సెక్రటేరిట్ మెట్రో స్టేషన్‌లో ముర్ము టికెట్ తీసుకుని రైలు ఎక్కారు. ఈ సందర్భంగా రైలులోని అధికారులు, అందులో ప్రయాణించే పాఠశాల విద్యార్థులతో కాసేపు సంభాషించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్వయంగా రాష్ట్రపతి తమతో పాటు ప్రయాణించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముర్ము మెట్రోలో ప్రయాణించడం ఇదే తొలిసారి.కాగా, గతంలో ప్రధాని మోడీ సైతం పలుమార్లు మెట్రోలో ప్రయాణించి ప్రజలతో మమేకమైన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News