బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష
బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి జైలు శిక్ష పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ దోషిగా నిర్ధారించబడ్డాడు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి జైలు శిక్ష పడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ దోషిగా నిర్ధారించబడ్డాడు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు అన్సారీ దోషిగా తేలడంతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే.. ఈ కేసులో ముఖ్తార్ అన్సారీ అన్నయ్య, బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై యూపీలోని ఘాజీపూర్ కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.