Muda Scam: వివాదంవేళ ముడా ఛైర్మన్ రాజీనామా

కర్ణాటకలో (Karnataka) ముడా స్కాం (MUDA scam) రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై (Siddaramaiah) విచారణ కొనసాగుతోంది.

Update: 2024-10-16 11:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో (Karnataka) ముడా స్కాం (MUDA scam) రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై (Siddaramaiah) విచారణ కొనసాగుతోంది. ఇలాంటి టైంలో ముడా అథారిటీ ఛైర్మన్ కె.మరిగౌడ (K Marigowda) పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. కాగా.. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతనెలలో మరిగౌడ కారులో బెంగళూరుకు వెళుతన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయన్ని బెంగళూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం మైసూరికి తరలించారు. అయితే, ఆ కారణాల వల్లే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ముడా స్కాంలో మరిగౌడ

ఇకపోతే, ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు మరిగౌడ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో మరిగౌడ ప్రమేయం కూడా ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు సిద్ధరామయ్య, మరిగౌడపై తీవ్ర ఆరోపణలు చేశాయి. ముడా స్కాంలో ఇరుక్కున్న సీఎంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే, సిద్ధరామయ్యపై పలు కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలోనే ఆయన సతీమణి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేసినా ఆయనకు అక్కడ కూడా చుక్కెదురైంది.


Similar News