గెలిపించినందుకు ఎంపీ కృతజ్ఞత!.. ప్రజలకు మందు, విందుతో భారీ దావత్
ఓట్లు వేసి గెలిపించినందుకు ఓ ఎంపీ తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు భారీ దావత్ ఏర్పాటు చేశాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్లు వేసి గెలిపించినందుకు ఓ ఎంపీ తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు భారీ దావత్ ఏర్పాటు చేశాడు. ఈ దావత్ లో 5 కంటెయినర్ల బిర్యానీతో పాటు, 5 కంటెయినర్ల మద్యాన్ని కూడా పంపిణీ చేసి ప్రజల కృతజ్ఞత తీర్చుకున్నాడు. కర్ణాటక లోని చిక్‌బళ్లాపూర్ పార్టమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి కే సుధాకర్ భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో తనకు ఓటు వేసి గెలిపించుకున్న ప్రజల రుణం తీర్చుకోవాలని సెగ్మెంట్ లోని ప్రజలకు భారీ దావత్ ప్లాన్ చేశాడు. ఈ పార్టీ కోసం ముందుగానే పోలీస్ పర్మిషన్ తో పాటు, ఆబ్కారీ శాఖ పర్మిషన్ కూడా తీసుకున్నాడు.
ఎంపీ దావత్ కి వచ్చిన ప్రజలకు మందు, విందుతో కడుపునింపాడు. పార్టీ జరుగుతున్న ప్రదేశంలో గందరగోళం జరగకుండా ముందే పోలీస్ భద్రత సైతం ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్త్ నడుమ మందు పంపీణీ చేస్తున్న దృష్యాలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒక్క సారిగా చిక్‌బళ్లాపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కే సుదాకర్ నెట్టింట ఫేమస్ అయిపోయారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఓటు వేసిన ప్రజలను మర్చిపోకుండా కనీసం దావత్ అయినా ఇస్తున్నారని, తమ వద్ద కూడా ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
यह आयोजन BJP सांसद के सुधाकर द्वारा किया गया है। जिसमें शराब बटवाएं जा रहे हैं।
— Priya singh (@priyarajputlive) July 8, 2024
वीडियो को लेकर दावा किया जा रहा है कि BJP सांसद ने जीत के जश्न में अपने कार्यकर्ताओं और समर्थकों के लिए यह पार्टी रखी थी. pic.twitter.com/OeW49dTKmW