ఢిల్లీలో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

దేశ రాజధాని ఢిల్లీని గురువారం ఉదయం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది.

Update: 2023-06-29 14:34 GMT

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని గురువారం ఉదయం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉదయం భారీ వర్షం కురవడంతో జామియా మెట్రో స్టేషన్ సమీప ప్రాంతం నీట మునిగిపోయింది. సారై కాలె ఖాన్, సౌత్ ఎక్స్‌టెన్షన్, గీత కాలనీ రింగ్ రోడ్, అక్షర్ధన్ ఆలయం సహా నగరంలోని అనేక ప్రాంతాల్లోకి నీరు చేరింది. అజాద్‌పూర్ ఫ్లై ఓవర్‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నగరంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.


Similar News