Modi vs Kharge: ‘దమ్ముంటే అబద్ధాలు కాదు.. నిజాలు చెప్పు మోడీ..’ ఖర్గే సెన్సేషనల్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: అబద్ధపు ప్రచారాలు నిజమైన అభివృద్ధి ఎప్పుడూ సాధించలేవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సాధారణ ప్రజల దగ్గరున్న ఆఖరి పైసా కూడా దోచుకుంటూ ఆర్థిక గందరగోళా సృష్టిస్తున్న మోడీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్కస్ వేదికగా ఈ రోజు (మంగళవారం) ఓ సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఖర్గే ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో లూటీకి గురైన మధ్యతరగతి ప్రజల్లో కనీసం పండుగల సమయంలో కూడా ఆనందం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆర్థిక వ్యత్యాసం అంతకంతకూ పెరుగుతోంది. పెట్టుబడులు దెబ్బతిన్నాయి. వేతన స్థాయిలో పెరుగుదల లేదు. వీటన్నింటికీ తోడు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిపోతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. వాళ్ల సేవింగ్స్ అన్నీ పనికిమాలిన పన్నులు చెల్లించడానికే ఖర్చు అయిపోతోంది’’ అంటూ డీటెయిల్డ్‌గా ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన ఖర్గే.. తన వాదనకు బలం చేకూర్చేలా ఓ 5 పాయింట్లను కూడా షేర్ చేశారు.
- ఆహార ద్రవ్యోల్బలనం 9.2 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం ఆగస్టులో 10.7 శాతంగా ఉండగా.. అది సెప్టెంబర్ నాటికి ఏకంగా 36 శాతానికి పెరిగిపోయింది.
- ఎఫ్‌ఎమ్‌సిజి రంగం డిమాండ్ బాగా క్షీణించిందనేది వాస్తవం. ఏడాది అమ్మకాలల్లో వృద్ధి 10.1% నుండి కేవలం 2.8%కి పడిపోయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే నెలవారీ నివేదికలోనే ఈ విషయం చెప్పింది. మార్జిన్‌లు క్షీణించినట్లు వెల్లడించిన FMCG కంపెనీలు.. కంపెనీలు ముడిసరుకు ఖర్చులు భరించలేకపోతే ధరల పెరుగుదలకు దారితీస్తుందని హెచ్చరించింది.
- హౌస్‌హోల్డ్ సేవింగ్స్ 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా వినియోగం తీవ్రంగా పడిపోయింది. ఉదాహరణకు, ఎఫ్‌అండ్‌బీ రంగంలో రెండంకెల వృద్ధిరేటు ఇప్పుడు 1-2 శాతానికి పడిపోయింది. తక్కువ జీతాల పెంపుదల, క్షీణిస్తున్న పెండెంట్-అప్ డిమాండ్, అధిక వడ్డీ రేట్లు, కఠినమైన క్రెడిట్ పరిస్థితుల కారణంగా అర్బన్ డిమాండ్ తక్కువగా ఉంటుందనేది విశ్లేషకుల మాట.
- సెప్టెంబరులో ప్యాసింజర్ వాహన విక్రయాలు 19% తగ్గాయి. అక్టోబర్ అమ్మకాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ఆటోమొబైల్ అమ్మకాలు 2.3% తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. గ్రామీణ ఆర్థిక ఆరోగ్యానికి కీలకమైన సూచికలైన ద్విచక్ర వాహనాల విక్రయాలు, 2018తో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాయి. SUV అమ్మకాలు కూడా 26 నెలల కనిష్టానికి పడిపోయాయి. సెప్టెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో భారతదేశంలోని టాప్ 8 నగరాల్లో గృహాల విక్రయాలు 5% క్షీణించాయి.
- కార్మికులకు నిజ వేతనాల పెరుగుదల 2014-2023 మధ్య కాలంలో నిలిచిపోయాయి. ఇంకా మాట్లాడితే 2019-2024 మధ్య తగ్గాయి. 2014-15, 2021-22 మధ్య, భారత శ్రామికుల ద్రవ్యోల్బణ సర్దుబాటు వేతనాలు 1% కంటే తక్కువగా పెరిగాయి.
పై విధంగా 5 పాయింట్లు షేర్ చేసిన ఖర్గే.. ఈ లెక్కలతో అసలు నిజమేంటో అర్థమవుతోందని, కానీ ఆయన కేవలం అబద్ధాలు, నటించడంలో పేరు మోసిన మోడీ ఇలాంటి పక్కా లెక్కల్ని పట్టించుకోరంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలసీలు దేశ ఆర్థిక స్థితిని దిగజారుస్తున్నాయని, దమ్ముంటే రాబోయే ఎన్నికల ప్రచారాల్లో ప్రతిపక్షాలపై అబద్ధాలు ప్రచారం చేయడం మానేసి సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.