కాంగ్రెస్‌ది మావోయిస్టుల ఎజెండా! ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీది మావోయిస్టుల ఎజెండా అని ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Update: 2024-05-02 15:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీది మావోయిస్టుల ఎజెండా అని ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని మావోయిస్టులు కబ్జా చేశారని చెప్పారు. మళ్లీ లైసెన్స్ రాజ్ తీసుకురావడానికి కుట్రలు చేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ నేతల ఆలోచనా విధానాన్ని మావోయిస్టులు కబ్జా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మావోయిస్టుల ప్రభావం ఉందని, అందుకే ఆర్థిక సర్వే చేస్తామంటున్నారన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. రాజ్యాంగం కూడా యూసీసీని సమర్ధించిందని, సుప్రీంకోర్టు కూడా యూసీసీపై కేంద్రాన్ని ప్రశ్నించిందన్నారు. ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. మరోవైపు శ్రీరాముడి లాంటి అవతార పురుషుడు ముందు బీజేపీ చాలా చిన్న శక్తి మాత్రమేనని తెలిపారు. శ్రీరాముడు అందరివాడు.. ఆయనపై ఎవరికి యాజమాన్య హక్కులు లేవన్నారు.

తమ ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికి వాళ్లు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాముడిని దర్శించుకుంటే ఓట్లు రావన్న భావనతో వాళ్ళు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ దివంగత నేత రాజీవ్ గాంధీ ఓ సారి తన ప్రచారాన్ని అయోధ్య నుంచి ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే ఇలా చేస్తే బీజేపీకి మీకు తేడా ఉండదని, వాళ్ల ఓటు బ్యాంకు నుంచి విమర్శలు రావడంతో వెనక్కి వెళ్లారని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వీళ్లంతా ఆలయాలకు వెళ్తారని, కానీ ఈసారి మాత్రం మందిరాలకు వెళ్లలేదని, ఎందుకంటే వాళ్లకు తిట్లు పడ్డాయన్నారు.

Tags:    

Similar News