Gujarat Election Result 2022 : గుజరాత్‌లో బీజేపీకి కలిసొచ్చింది అదేనా?
గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల వ్యూహం ఫలించింది. సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకునే విధంగా వారు నిర్వహించిన విభిన్న ప్రచార శైలి ఉపయోగపడింది.
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల వ్యూహం ఫలించింది. సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకునే విధంగా వారు నిర్వహించిన విభిన్న ప్రచార శైలి ఉపయోగపడింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర వ్యాప్తంగా 35 సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించడం గమనార్హం. దీంతో ఊహించని రేంజ్‌లో దాదాపు 150 స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో 99 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఈసారి 150కి స్థానాల్లో లీడ్‌లో ఉండటం బీజేపీ శ్రేణుల్లో జోష్ పెంచుతోంది. ఈసారి గెలిస్తే వరుసగా ఏడుసార్లు గెలిచిన పార్టీ గుజరాత్‌లో బీజేపీ చరిత్ర సృష్టించనుంది. అంతేగాకుండా.. గతంలో ఏ పార్టీ సాధించనన్న స్థానాలను కైవసం చేసుకోబోతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలువుతున్న కాంగ్రెస్ పార్టీ.. గుజరాత్‌లోనూ దారుణంగా విఫలమైంది. గతంలో 77 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, ఈసారి కేవలం 18 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.
Also Read....